
శ్రీ చైతన్య విద్యాసంస్థలు నిర్వహించిన ఐ. ఎన్. టి .ఎస్. ఓ పరీక్షలలో చింతలపూడి విద్యార్థుల ప్రభంజనం
స్థానిక చింతలపూడి శ్రీ చైతన్య విద్యార్థులు ఐ.న్.టి.ఎస్.ఓ పరీక్షలల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి మొత్తం 247 బహుమతులు పొందారు. ప్రథమ బహుమతి లాప్టాప్ ,ద్వితీయ బహుమతి స్మార్ట్ వాచ్, తృతీయ బహుమతి బ్యాగ్ ను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ వరలక్ష్మి ప్రసన్న గారు విద్యార్థులు వారి సాధించిన ఘనతను ప్రశంసిస్తూ ఇటువంటి విజయాలను పరంపరలను మున్ముందు కొనసాగించాలని వారి ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యాసంస్థల AGM శ్రీ పార్థసారధి గారు, రీజినల్ ఇంచార్జ్ ఉదయభాస్కర్ గారు, కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు గారు, ఏవో రవీంద్ర గారు ,అకాడమిక్ డీన్ ఎన్ చెన్నకేశవ గారు , సి బ్యాచ్ ఇంచార్జ్ మధు గారు ,ప్రైమరీ ప్రీ ప్రెమరీ ఇన్చార్జులు మరియు ఐ .ఎన్. టి .ఎస్ ఓ ఇన్చార్జులు నాగమణి గారు సునీల్ గారు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.








