
ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ధ దేవాలయాలలో అభివృద్ధి పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ టెంపుల్ టూరిజం మరియు కేంద్ర ప్రభుత్వ ప్రసాదం స్కీముల ద్వారా జగ్గయ్యపేట నియోజకవర్గంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం పెనుగంచిప్రోలు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుమలగిరి, శ్రీ కోటిలింగ హరిహర మహా క్షేత్రం ముక్తేశ్వరపురం, శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వేదాద్రి ఈ నాలుగు దేవాలయాలను అభివృద్ధి చేయవలసిందిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని సోమవారం విజయవాడలో ఎంపీ కేశినేని శివనాద్ చిన్నితో కలిసి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య లేఖను అందజేశారు.








