
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ నిబంధనలు కి విరుద్ధంగా వ్యవహరిస్తున్న అన్ని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఈఓ యేసుబాబు ని కలిసి వినతి పత్రం అందించిన రాష్ట్ర విద్యార్థి యువసేన అధ్యక్షులు సంపెంగుల రవికుమార్.
పల్నాడు జిల్లా లో ప్రైవేట్ పాఠశాలలు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఐఐటి, ఏసీ క్యాంపస్ ల పేరుతో వేలకి వేలు వసూలు చేస్తూ ముఖ్యంగా శ్రీ చైతన్య, నారాయణ లాంటి విద్య సంస్థల్లో ఐ. బి. మరియు సి బి ఎస్ ఈ. సిలబస్ అని చెప్పి వేలకి వేల రూపాయలు వసూలు చేస్తూ,మెటీరియల్ పేరిట పుస్తకాలకి, ఒకరేటు, యూనిఫాం కి ఒకరేటు,అడ్మిషన్ కి ఒకరేటు, పాఠశాల ఫీజ్ రేటు, డొక్కు స్కూల్ బస్సుల ఫీజు అంటూ ఇలా తల్లిదండ్రుల బలహీనతలను ఆసరాగా తీసుకొని వాళ్ళను నిలువు దోపిడి చేస్తున్నారని,అక్షరాలు కూడా తెలియని పిల్లలకు నర్సరీ, ఎల్కేజీ మరియు యూకేజీ ల పేరుతో వేలకు వేలు గుంజుతూ వ్యాపారం చేస్తున్నారని ఇప్పటికైనా సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు మరియు ప్రభుత్వం దృష్టి సారించాలని ఈ నిలువు దోపిడీని అరికట్టి ప్రజలకు న్యాయం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యార్థి యువసేన అధ్యక్షులు సంపెంగుల రవికుమార్, నర్సరావుపేట అధ్యక్షులు,జి శామ్యూల్, వెంటకేష్, రాజేష్, అనిల్ , సాయి తదితరులు పాల్గొన్నారు.







