
అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో జగ్గయ్యపేట పట్టణంలో నిర్వహించిన డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్, డి.ఎస్.పి ఏజీబి తిలక్, రూరల్ డిసిపి KN మహేశ్వర రాజు, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర గారు, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరాం ధనుంజయ్ (చిన్నబాబు), పోలీసు అధికారులు పాల్గొని చిల్లకల్లు రోడ్డులో గల చత్రపతి శివాజీ విగ్రహం వద్ద నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ.
యువత భవిష్యత్తు కోసం మనందరం కలిసికట్టుగా పని చేయాలి. డ్రగ్స్ లాంటి వ్యసనాలు యువతను మానసికంగా, శారీరకంగా నాశనం చేస్తున్నాయని
ఒకసారి ఈ మాదక ద్రవ్యాలకు బానిసైతే, జీవితమే చీకట్లోకి వెళ్ళిపోతుందని, ప్రతి ఒక్కరూ డ్రగ్స్ కి చెక్ పెట్టే విధంగా ముందడుగు వేయాలని, కుటుంబాలు, పాఠశాలలు, కళాశాలలు, పోలీస్ శాఖ, ఆరోగ్య శాఖ అందరూ కలిసి నిరంతరం అవగాహన కల్పించాలని అన్నారు.
ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకువచ్చింది. కానీ చట్టాల కంటే ముందుగా మన సంస్కారం, మన బాధ్యత కలిసివచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రమాదాన్ని నిర్మూలించగలమన్నారు.
యువత ఆత్మవిశ్వాసంతో, సరైన మార్గంలో ఎదగాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
డ్రగ్స్ ఎల్లప్పుడూ ‘నో’ అని చెప్పండి, ఆరోగ్యకరమైన జీవితం వైపు ముందడుగు వేయాలని
ఇలాంటి కార్యక్రమాలు మరింత నిర్వహించి, సమాజాన్ని మేల్కొలపళని కోరారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి టీవీ కృష్ణారావు, సీఐ పి వెంకటేశ్వర్లు, జగ్గయ్యపేట ఎస్సై రాజు, వత్సవాయి ఎస్సై ఉమామహేశ్వరరావు, పెనుగంచిప్రోలు ఎస్సై అర్జున్, చిల్లకల్లు ఎస్సై సూర్య శ్రీనివాస్ మరియు మున్సిపల్ కౌన్సిలర్స్ కన్నెబోయిన రామలక్ష్మి, గొట్టే నాగరాజు, నకిరకంటి వెంకట్, ఇర్రి నరసింహారావు, పేరం సైదేశ్వర రావు మరియు నాయకులు షేక్ ఖాసిం, షేక్ గౌస్ భాష, గడ్డం హుస్సేన్, మల్లెల కొండయ్య, కర్ల జోజి, యమర్తి బోస్ యాదవ్, దువ్వల రామకృష్ణ, మన్నె నారాయణ, రావూరి విశ్వనాథం, ముత్తినేని అశోక్, బొబ్బిళ్ళపాటి ప్రసాద్ మరియు NCC ,NSS, స్కూల్స్, కాలేజీల విద్యార్థినీ విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







