పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం
సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న PCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది.విస్తృత స్థాయి సమావేశాల్లో అన్ని సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నాం.రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడటం రాజకీయంగా చాలా అవసరం.కాంగ్రెస్ అధికారంలో వస్తేనే విభజన హామీలు సాధ్యం.బీజేపీ గడిచిన 10 ఏళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత
కానీ బీజేపీ రాజధానికి అప్పులు ఇస్తుంది.పోలవరం ఎత్తు తగ్గించి రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది.బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాలను టీడీపీ, వైసీపీ,జనసేన పార్టీలు తాకట్టు పెట్టాయి.రాష్ట్రంలో స్వార్థ రాజకీయాలు నడుస్తున్నాయి.బీజేపీ కి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు.బీజేపీని వ్యతిరేకించేది ఒక్క కాంగ్రెస్ మాత్రమే .అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుంది.బీజేపీని ఎదిరించే సత్తా ఉన్నది కాంగ్రెస్ కి మాత్రమే.రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి అన్ని వ్యూహాలు రచిస్తున్నాం.గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాం.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామన ప్రభాకర్, అధికార ప్రతినిధి నాగరాజ,కాంగ్రెస్ రాష్ట్ర స్పోర్ట్స్ సంఘం అధ్యక్షులు కమలాకర్,పల్నాడు జిల్లా డిసిసి అధ్యక్షులు గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్, మాచర్ల నియోజకవర్గ వై. రామచంద్రారెడ్డి, గురజాల నియోజకవర్గ ఇంచార్జ్ టి.యలమందారెడ్డి, వినుకొండ నియోజకవర్గ ఇంచార్జ్ బి.రామాంజనేయులు, పెదకూరపాడు నియోజకవర్గ ఇంచార్జ్ పి.నాగేశ్వరావు, సత్తెనపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ సి హెచ్ చంద్రపాల్, చిలకలూరిపేట నియోజకవర్గ ఇంచార్జ్ ఎం. రాధాకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఎస్ ఎం భాష, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.