అద్దంకి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గా బాపట్ల – 1 బాయ్స్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నాగరాజు ను ఎఫ్ ఏ సీ అదనపు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా శనివారం
జిల్లా అధికారి వీర శివలీల తన కార్యాలయంలో నాగరాజు కు నియామక పత్రాన్ని అందించారు.అద్దంకి అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేస్తున్న బీ.శారద రాణి బదిలైపై పల్నాడు జిల్లా సత్తెనపల్లి అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గా బదిలీపై వెళ్ళారు.దీంతో ఖాళీగా ఉన్న అద్దంకి ఏ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ స్థానంలో ప్రభుత్వం నాగరాజును అదనపు బాధ్యతలు ఇస్తూ నియమించింది. ఈ సందర్భంగా బాపట్ల బీసీ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ అధికారి కార్యాలయంలో ఆయనకు నియామక పత్రం అందచేశారు.
244 Less than a minute