జనసేన పార్టీ నేత కిలారి రోశయ్య ఆధ్వర్యంలో కూటమి నేతల బ్రేక్‌ఫాస్ట్ & ఆత్మీయ సమావేశం. హాజరైన గుంటూరు మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ. కోవెలమూడికి భారీ మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని పిలుపు. జనసేన సమన్వయ కమిటీ సభ్యులు గుంటూరు నగర కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు భారీ మెజారిటీ సాధించడమే లక్ష్యంగా జనసేన నేతలు కార్యాచరణకు సిద్ధమయ్యారు. మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో జనసేన, కూటమి నేతలు పాల్గొని ఎన్నికల ప్రచారంపై చర్చించారు. లక్ష్మీ అపర్ణకు భారీ మెజారిటీ సాధించేలా సమష్టిగా కృషి చేస్తామని జనసేన నేతలు తెలిపారు. ఆమె ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లోని కార్పొరేషన్ల ఎన్నికల్లో గుంటూరులో అత్యధిక మెజారిటీ సాధించేలా ప్రజలు తీర్పు ఇవ్వనున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు, కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు.
GUNTUR CITY NEWS: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కోవెలమూడి లక్ష్మీ అపర్ణ

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
31°C
Vijayawada
light rain
31° _ 31°
63%
2 km/h
Fri
31 °C
Sat
33 °C
Sun
32 °C


