గుంటూరు నగరంలోని పట్టాభిపురం వద్ద ఉన్న మస్జిద్-ఏ-అతీఖుర్ రెహమాన్ నందు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమంలో గుంటూరు నగర కూటమి మేయర్ అభ్యర్థి లక్ష్మి అపర్ణ కోవెలమూడి , 49వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బండ్రెడ్డి విద్యావతి కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు, స్థానిక ప్రముఖులు, ముస్లిం సోదరులను ఆత్మీయంగా పలకరించారు. మతసామరస్యం, సోదరభావం, శాంతియుత సహజీవనం ప్రాధాన్యతను చాటుతూ, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, గుంటూరు నగరం శాంతి, సౌభ్రాతృత్వాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.



