Bapatla District City News :రేపల్లె కూటమి జడ్పీటీసీ అభ్యర్థులకు మంత్రులు, ప్రజాప్రతినిధుల అభినందనలు-బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల కార్యక్రమానికి హాజరైన కూటమి నేతలు

S Sarath
2 Views

బాపట్ల:- రేపల్లె నియోజకవర్గానికి చెందిన కూటమి పార్టీల జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొని జడ్పీటీసీ అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపి, ఎన్నికల్లో విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచించారు.Bapatla District City News

కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, కేడబ్ల్యూడీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review