విశాఖలో హో..హో.. బస్సులు వచ్చేశాయి! ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు రెడీ||Vizag Welcomes HOHO Buses: Get Ready to Explore Nature in Style
విశాఖలో హో..హో.. బస్సులు వచ్చేశాయి! ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు రెడీ..Vizag Welcomes HOHO Buses: Get Ready to Explore Nature in Style
ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న విశాఖలో, ఇప్పుడు పర్యాటక ప్రేమికుల కోసం కొత్త తీపి సర్‌ప్రైజ్ రెడీ అయింది. వైజాగ్ బీచ్ రోడ్ పై హో..హో.. బస్సులు పరుగులు తీయనున్నాయి.
సుందరమైన బీచ్‌లు, ఆహ్లాదకర వాతావరణం, ఆకట్టుకునే పర్యాటక ప్రాంతాలతో విశాఖ ఎప్పుడూ పర్యాటకుల్ని ఆకర్షిస్తూనే ఉంది. ఒకసారి వచ్చిన వారు తిరిగి తిరిగి రావాలనుకునే విధంగా ఉన్న ఈ నగరంలో, పర్యాటక శాఖ మరో అడుగు ముందుకు వేసింది. విశాఖ బీచ్ రోడ్‌పై హాప్ ఆన్ – హాప్ ఆఫ్ (HOHO) ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది.
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖలో ఈ బస్సులను పరిశీలిస్తూ, త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపారు. పర్యాటకులకు, నగరవాసులకు, విద్యార్థులకు ఒక వినూత్నమైన అనుభూతిని అందించడమే ఈ బస్సుల లక్ష్యం. పర్యావరణ హితమైన ఈ ఈవీ బస్సులు, డబుల్ డెక్కర్ అద్దాల బస్సులు కావడం ప్రత్యేకత.
ఇప్పటికే ఒక బస్సు విశాఖకు చేరుకుండా, రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు దాదాపు 25 కిలోమీటర్ల మేర బీచ్ రోడ్ పైన ఈ బస్సులు పర్యటించనున్నాయి. ఆర్కే బీచ్ – తెన్నేటి పార్క్ – కైలాసగిరి – ఋషికొండ – తొట్లకొండ – భీమిలి బీచ్ వరకు వెళ్లి తిరిగి వచ్చేలా రూట్ సిద్ధం చేస్తున్నారు.
హో..హో.. అంటే ఏమిటి?
‘Hope On Hope Off’ అంటే చక్కగా Hop On Hop Off. విదేశాల్లో పర్యాటక నగరాల్లో విస్తృతంగా ఉపయోగించే ఈ బస్సులు, విశాఖలో తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే:
🔸 డబుల్ డెక్కర్ కాంక్రీట్ అద్దాల బస్సులు
🔸 కొన్ని బస్సులు పూర్తిగా ఏసీ గల క్లోజ్డ్ గ్లాస్ ఉండగా, కొన్ని ఓపెన్ టాప్‌లో ఉండి చల్లటి గాలిలో ప్రయాణం చేసే అవకాశం
🔸 పై అంతస్తులో నుంచి ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా ఆస్వాదించగలిగే సౌకర్యం
🔸 కింద సీటింగ్‌లో గ్లాస్ విండోస్ ద్వారా ప్రకృతి అందాలను వీక్షించే సౌకర్యం
ప్రకృతి అందాలను తిలకించడంలో కొత్త అనుభవం:
డబుల్ డెక్కర్ బస్సులో కూర్చుని సముద్ర తీరాన్ని, పచ్చని కొండలను, సూర్యాస్తమయ దృశ్యాలను చూడటం అనేది వేరే స్థాయి అనుభూతి. మనం విదేశాల్లో ఉన్నామా లేదా వైజాగ్‌లో ఉన్నామా అని అనిపించేలా ఈ ప్రయాణం ఉండబోతోంది.
విశాఖ పర్యాటక రంగం కొత్త దిశలో:
“విశాఖ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో తీసుకువెళ్తాయి ఈ డబుల్ డెక్కర్ బస్సులు” అని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పర్యాటకుల సంఖ్య పెరగడం ద్వారా నగర ఆర్థిక వ్యవస్థకు తోడు, స్థానికులకు ఉపాధి అవకాశాలు సృష్టించేలా ఈ పథకం పని చేస్తుందన్నారు.
ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ పరిశీలన:
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరీంధిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌లతో కలిసి, మంత్రి కందుల దుర్గేష్ రుషికొండ బీచ్‌లో బ్లూ ఫ్లాగ్ ప్రమాణాల అమలు స్థితిని పరిశీలించారు. బీచ్ వద్ద దుకాణదారులు, లైఫ్ గార్డులు తెలిపారు సమస్యలను పరిశీలించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
“బ్లూ ఫ్లాగ్ ప్రమాణాలను కొనసాగించడం, బీచ్ సుందరీకరణకు మరిన్ని చర్యలు తీసుకోవడం, పర్యాటక సదుపాయాలను పెంచడం మా లక్ష్యం” అని మంత్రి తెలిపారు. బీచ్ పర్యావరణం, పరిశుభ్రత నిలుపుకోవడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
తుదిగా, విశాఖలో ప్రకృతి అందాలను కొత్తగా ఆస్వాదించాలనుకునే వారిని HOHO బస్సులు ఆహ్వానిస్తున్నాయి. త్వరలోనే వీటిలో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిద్దాం అన్న ఆశతో పర్యాటకులు ఎదురుచూస్తున్నారు.