బాపట్ల జిల్లా చీరాల ఆర్ టీ సి బస్ స్టాండ్ ని సందర్శించిన రీజియనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూటమి తరపున నేను ప్రతి బస్ స్టాండ్ ను పరిశీలిస్తున్నాను.ప్రయాణీకులు వారి వారి అభిప్రాయాలు వెల్లడించారు.సౌకర్యాలు అన్నీ బాగున్నాయని తెలిపారు.చీరాల బస్ స్టాండ్ లో పారిశుధ్య కార్మికులు చక్కగా పనిచేస్తున్నారు.బస్ స్టాండ్ అక్కడక్కడా స్లాబ్ దెబ్బతిని ఉండటం గమనించాను.అవికూడా మరమ్మత్తులు చేపడతాం.అదేవిధంగా మహిళలకు ఆగస్టు పదిహేను నుండి ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తుంది.అందుకు తగిన విధంగా వర్కింగ్ స్టాఫ్ ను నియమిస్తాం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చీరాల ఆర్ టీ సి డీ ఎం,బీజేపీ,జనసేన,తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.