Motor thieves arrested in Vetapalem
వేటపాలెం: బాపట్ల జిల్లా వేటపాలెంలో 5HP మోటార్ల దొంగతనంలో పాల్గొన్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్ నాసిర్ వాలి @షను (21), తండ్రి బాజీ (లేట్), జగనన్న కాలనీ వేటపాలెం నివాసి మరియు షేక్ సుభానీ (21), తండ్రి కరిముల్లా, మార్కెట్ సెంటర్ వేటపాలెంకు చెందినవారు ముద్దాయిలుగా గుర్తించబడ్డారు.
పిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన వేటపాలెం ఎస్ఐ జనార్ధన్ గారి నాయకత్వంలో పోలీసులు నిందితుల వద్ద నుండి విలువ రూ.1,10,000 లకు సమానమైన రెండు 5HP మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చెడు వ్యసనాలకు బానిసలై, చుట్టుపక్కల పోలాలలో మోటార్లు దొంగలించి ఆ డబ్బుతో అడ్డదారిలో జల్సాలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
నిందితులను జూలై 5న మధ్యాహ్నం 12.30 గంటలకు అరెస్ట్ చేసి, డిమాండ్ నిమిత్తం చీరాల అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గారి ఎదుట హాజరుపరిచినట్టు పోలీసులు తెలిపారు.