సూర్యలంక సముద్రతీరంలో కొట్టుకుపోతున్న యువకుడిని రక్షించిన పోలీసులు, గజయితగాళ్ళు
వివరాలలోకి వెళితే…. జులై 6 ఆదివారం గుంటూరు పట్టణం ప్రగతి నగర్ కు చెందిన ఉదయ్ రాజు (20) బాపట్ల సూర్యలంక తీర ప్రాంతంలో సముద్రంలో మునుగుతూ ఒక్కసారిగా వచ్చిన అలల దాటికి సముద్రంలోకి కొట్టుకుపోతు కేకలు వెయ్యగా సూర్యలంక అవుట్ పోస్ట్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఎం.పోతురాజు, విక్టర్, గజ ఈతగాళ్లు అతనిని గమనించి అందరు కలిసి ప్రాణాలకు తెగించి సముద్రంలో కొట్టుకుపోతున్న యువకుడిని రక్షించారు. 108 ద్వారా బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు .
హెడ్ కానిస్టేబుల్ పోతురాజు, విక్టర్, గజ ఈతగాళ్లు సుందరయ్య, రామయ్య, నాగేశ్వరావు, మీరా సాయిబు, దుర్గ, కార్తీక్, బాలు, హోమ్ గార్డ్ నరసింహ మూర్తి ఉన్నారు.