బాపట్ల …మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్నటువంటి తొవ్వ కాలవ వంతెన పై నిలబడి మానవహారం గా ఏర్పడి నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తంచేశారు… సిఐటియు బాపట్ల జిల్లా నాయకులు. తిరుమలరెడ్డి మాట్లాడుతూ…..
ఈ సందర్భంగా గతంలో 17 రోజుల సమ్మె ఒప్పందాలను అమలు చేయకుండా వేతనాలు పెంచాలని,సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న పట్టించుకోని రాష్ట్రప్రభుత్వం,మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జూలై 12 నుండి అత్యవసరాలు మంచినీళ్లు,విద్యుత్తు లాంటి విధులు నిర్వహిస్తున్న కార్మికులు కూడా నిరవధిక సమ్మెలోకి వెళ్లి ఆందోళన ఉదృతం చేస్తామని అన్నారు,ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమిస్కిల్డ్ వేతనాలు అమలుచేయాలి,జీవో నెంబర్ 36 ప్రకారం 24,500 వేతనం అమలుచేయాలి,తక్షణం తల్లికివందనం ఇవ్వాలి,ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమపథకాలు అమలుచేయాలి,గత సంవత్సరం 17రోజుల సమ్మె ఒప్పందాలు అమలుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు బాపట్ల పట్టణ అధ్యక్షులు ఓ. లక్ష్మణరావు,సిఐటియు నాయకులు కె.శరత్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ బాపట్ల జిల్లా నాయకులు రత్నం,నాని,చక్రవర్తి యూనియన్ బాపట్ల పట్టణ అధ్యక్షులు మురళీకృష్ణ, నాయకులు హరిబాబు,ప్రమీల, అశోక్ సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు