వెలగపూడి సచివాలయంలో గురువారం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా పరిశీలించారు. బందోబస్తులో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని ఆయన ఆదేశించారు. అసెంబ్లీకి హాజరయ్యే వీవీఐపీ, వీఐపీ, మీడియా, సందర్శకుల ప్రవేశం కోసం 1, 2, 3, 4 గేట్లు పరిశీలించి, నిర్ణీత వ్యక్తులకే అనుమతించాలని, అందరితో మర్యాదపూర్వకంగా, వినయంతో వ్యవహరించాలని సూచించారువీవీఐపీ వాహనాలు మరియు ఇతర వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలిపివేయాలని, రోడ్లపై అనవసర పార్కింగ్ లేకుండా ట్రాఫిక్ సాఫీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ (L&O) ATV రవికుమార్, తుళ్లూరు డిఎస్పీ మురళీ కృష్ణ, ఎస్బి సీఐ అలహరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
203 Less than a minute