Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

ఎన్టీఆర్ గారికి ఘనంగా నివాళి…..

అన్న ఎన్టీఆర్ గారిది మరణం లేని జననం.

-మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు.

ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడిలో అన్న ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణలు.

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 18.01.2025.

తెలుగుదేశం పార్టీ ప్రపంచవ్యాప్తంగా కోటి సభ్యత్వాలకు పైగా నమోదుతో అన్న ఎన్టీఆర్ గారికి మనం ఇస్తున్న ఘనమైన నివాళి ఇదే అంటూ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు పేర్కొన్నారు.

ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో గౌరవ విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు, అన్న ఎన్టీఆర్ గారి 29వ వర్ధంతి సందర్భంగా అన్న ఎన్టీఆర్ గారి రెండు విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో మైలవరం సభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొన్నారు. జోహార్ ఎన్టీఆర్, జై టిడిపి అంటూ నినదించారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ గారు పేదల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుందన్నారు. గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో రికార్డులు సృష్టించిందన్నారు.

అన్న ఎన్టీఆర్ గారి ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ప్రజలకు సేవలు అందిస్తోందన్నారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అన్న ఎన్టీఆర్ గారు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు.

అన్న ఎన్టీఆర్ గారిది మరణం లేని జననం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరి హృదయాల్లో చిరస్థాయిగా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. అటువంటి మహోన్నత నేత విగ్రహాన్ని కొటికలపూడిలో ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కొటికలపూడి గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

అనంతరం గోకులాన్ని ప్రారంభించారు. ముందుగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, బీజేపీ మైలవరం నియోజకవర్గ ఇంచార్జి నూతులపాటి బాలకొటేశ్వరరావు (బాల) గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button