
బాపట్ల:యోగ అభ్యసనాన్ని క్రమం తప్పకుండా అలవాటు చేసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించడంతో పాటు ఆరోగ్యవంతమైన, సమతుల్య సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని బాపట్ల శాసనసభ్యుడు వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. యోగ, క్రీడల ద్వారా విద్యార్థులకు శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా, వృత్తిపరంగా కూడా బహుళ ప్రయోజనాలు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు.
జిల్లెళ్ళమూడిలోని విశ్వ జనని పరిషత్ ట్రస్ట్ ఆవరణలో నిర్వహించిన 44వ జాతీయస్థాయి యోగాసనా ఛాంపియన్షిప్ పోటీలను కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేటి రోజువారి జీవితంలో ఒత్తిడి, పనుల భారంతో చాలా మంది ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారని, కానీ యోగను క్రమశిక్షణతో అభ్యసిస్తే జీవనశైలి సంబంధిత అనారోగ్యాల నుంచి దూరంగా ఉండవచ్చని సూచించారు. Chirala lo Mega job Mela
నిబద్ధతతో కూడిన యోగాభ్యసనం శరీర ఆరోగ్యంతో పాటు మనస్సుకు ప్రశాంతతను అందిస్తుందని అన్నారు. విద్యార్థులు యోగ, క్రీడల్లో రాణించడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ఆర్థిక ప్రయోజనాలు, వృత్తి అవకాశాలు, వ్యక్తిత్వ వికాసం కూడా సాధ్యమవుతాయని వివరించారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా యోగ, కరాటే వంటి క్రీడల్లోనూ ఆసక్తి పెంచుకుని సాధన చేయాలని విద్యార్థులకు సూచించారు.
భారతదేశం యోగ విద్యలో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిందని, ప్రపంచ యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా గర్వంగా నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. వర్తమానంతో పాటు భావితరాల ఆరోగ్య రక్షణ కోసం యోగ అభ్యసనం అనివార్యమని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధిగా నిరంతరం ప్రజల మధ్య ఉండే బాధ్యతల వల్ల తనకు యోగ అభ్యసనంలో కొంత అంతరాయం ఏర్పడుతున్నప్పటికీ, నెలలో కనీసం 15 రోజులు యోగ, జిమ్, వ్యాయామం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. Chirala Local News :చీరాల బాయ్స్ హై స్కూల్ ఆవరణలో ఘనంగా హిందూ సమ్మేళనం
దేశంలోని పలు రాష్ట్రాల నుంచి యోగాసన పోటీలకు బాపట్లకు క్రీడాకారులు రావడం ఆనందంగా ఉందని పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగ అసోసియేషన్‌కు తాను అండగా ఉంటానని, భవిష్యత్తులో చేపట్టే ప్రతి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తానని సభాముఖంగా ప్రకటించారు. Bapatla Local News
ఈ కార్యక్రమంలో ఇండియన్ యోగ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజి భూషణ్ పురోహిత్, ప్రధాన కార్యదర్శి మృణాల్ చక్రబోర్తి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగ అసోసియేషన్ అధ్యక్షుడు కూన కృష్ణదేవరాయలు, చైర్మన్ కళ్ళం హరినాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అల్లాడి రవికుమార్, విశ్వ జనని పరిషత్ గౌరవాధ్యక్షులు ఎం. దినకర్, బి. రవీంద్రబాబు, బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడు సలగల రాజశేఖర్ బాబు, నరేగా మాజీ కౌన్సిల్ సభ్యురాలు మొవ్వ లక్ష్మి సుభాషిణి, వివేక సర్వీస్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళీకృష్ణ, ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు శీలం శ్రీనివాసరావు, అసోసియేషన్ కోఆర్డినేటర్ పిన్నిబోయిన శ్రీమన్నారాయణతో పాటు ఇతర సభ్యులు, క్రీడాకారులు, యోగాభ్యాసకులు పాల్గొన్నారు.











