
ఏలూరు నగరంలో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున యువత ఫీజు పోరుపై నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ నాయకులు దూలం నాగేశ్వరరావు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, పార్లమెంటు సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్, ఏలూరు నగర అధ్యక్షులు జయప్రకాష్ లు ఫైర్ స్టేషన్ సెంటర్లో వైయస్సార్ విగ్రహానికి పూలమాలు వేసి నిరసన కార్యక్రమం ప్రారంభించారు. ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి ర్యాలీగా కలెక్టరేట్ వరకు సాగింది. అనంతరం జిల్లా కలెక్టర్ కు నిరంత పత్రాన్ని సమర్పించారు. ఆ ప్రకారంగా ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరకాలంలో ప్రజాపాలనలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా లోని వైసిపి కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు.








