chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
అమరావతిఆంధ్రప్రదేశ్

AMARAVATHI NEWS:రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో నూతన అధ్యాయం- రాజయ్యపేటలో రూ.1.36 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

అమరావతి, మార్చి 23: రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి చరిత్రలో ఈరోజు ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడుతోందని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అభివర్ణించారు. ఉక్కు రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు రూ.1.36 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ప్రతిష్టాత్మక ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో జరగనున్న ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కూడా పాల్గొననున్నారు. https://www.youtube.com/embed/3kc3SzKdRUE?si=q-WrVZ5kkLaOgcth

ఈ భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని లక్ష మందికి పైగా నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. అంతేకాకుండా, ఈ స్టీల్ ప్లాంట్‌కు అనుబంధంగా సుమారు రూ.11,198 కోట్ల వ్యయంతో ఒక క్యాప్టివ్ పోర్టును కూడా అభివృద్ధి చేయనున్నట్లు, దీని ద్వారా మరో 6 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆయన వివరించారు. ఆర్సెలర్ మిట్టల్ వంటి ప్రపంచ స్థాయి సంస్థ రాకతో విశాఖపట్నం రీజియన్ ఒక భారీ పరిశ్రమల హబ్‌గా రూపాంతరం చెందుతుందని మంత్రి సత్యప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. http://AMARAVATHI NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker