నరసరావుపేట ప్రకాష్ నగర్ సోమవారం సాయంత్రం ప్రైవేట్ విద్యాసంస్థ సెయింట్ జోసెఫ్ హై స్కూల్ వద్ద వేగంగా వచ్చిన కారు స్కూల్ గేట్ వద్ద ఉన్న విద్యార్థులను డీకొట్టింది. పక్కన నిలిపిన ద్విచక్ర వాహనాలను కూడా ఢీకొడుతూ ముందుకు పోయింది.ఈ దుర్ఘటనలో స్కూల్ నుండి బయటకు వస్తున్న ఓ చిన్నారి విద్యార్థిని గాయాలపాలయ్యింది. స్థానికులు వెంటనే స్పందించి చిన్నారి ని దగ్గర ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి వైద్యం చేయించారు . కారు నడిపిన వ్యక్తి వేగం అదుపులో లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్కూల్ వద్ద భద్రతా చర్యలు మరింత బలపర్చాల్సిన అవసరం ఉందని స్థానికులు సూచిస్తున్నారు.
228 Less than a minute