
NTR Vijayawada:21-11-25:-పొరుగువారి హక్కులతోనే సమాజం సుభిక్షం… ఈ సందేశాన్ని పలుకరిస్తూ జమాఅతె ఇస్లామీ హింద్ దేశవ్యాప్తంగా చేపట్టిన “ఆదర్శ పొరుగు – ఆదర్శ సమాజం” ఉద్యమానికి సంబంధించి పోస్టర్, కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలో నిర్వహించారు.విజయవాడ సెంట్రల్ యూనిట్ ఆధ్వర్యంలో మాచవరం మస్జిద్ ఎ హిలాల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మిల్లీ వ్యవహారాల కార్యదర్శి ముషాహిద్ గారు, మస్జిద్ ఎ హిలాల్ అధ్యక్షుడు ఆకిబ్ గారు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా నవంబర్ 21 నుండి 30 వరకు పొరుగువారి హక్కులపై అవగాహన సృష్టించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అదే విధంగా జుమా నమాజ్ సందర్భంగా ఇమామ్ గారు పొరుగువారి హక్కులు, వాటి ప్రాముఖ్యత గురించి విశదీకరించి, సౌహార్ద సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.







