
విజయవాడ:02-11-25:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ప్రత్యేక హోదా ఉద్యమ యోధుడు కీర్తిశేషులు గొల్లపల్లి ఫణి రాజు గారి సంస్మరణ సభ ఆదివారం విజయవాడలో జరిగింది. ఆలిండియా జైహింద్ పార్టీ అధ్యక్షులు ఎం. దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన దశరథ రామిరెడ్డి గారు మాట్లాడుతూ — “ఫణి రాజ్ గారు సమైక్య ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పార్టీ, వ్యక్తుల మధ్య తేడా లేకుండా అందరినీ కలుపుకుని ముందుకు నడిపిన వ్యక్తి. ఆమ్ ఆద్మీ పార్టీలో ఆయన చేసిన సేవలు గుర్తుంచుకునేవి.
అలాంటి మహనీయుడు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం” అని అన్నారు.ఈ కార్యక్రమానికి కే. సూరిబాబు (నేషనల్ లిస్ట్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు), ఎస్. శివశంకర్ రెడ్డి, రావు సుబ్రహ్మణ్యం, కే. విజయ్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు జి. ఆదాము, ఎం. రాజా శ్రీనివాస్, బాలసుబ్రమణ్యం, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శీతల్, ఆదినారాయణ, వీరం శెట్టి నాగేంద్ర, నగేష్ తదితరులు హాజ







