
బాపట్ల : పర్చూరు :02-11-25:- చిన్నగంజాం మండలంలో ఉన్న సీతారాముల ఆలయంలో పునః ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరగనుంది. స్థానిక అన్నపూర్ణ థియేటర్ సమీపంలో ఉన్న ఈ 100 సంవత్సరాల నాటి ప్రాచీన దేవాలయాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించి, సోమవారం ఉదయం 10:43 గంటలకు పునః ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ వేడుకను దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామ నారాయణరెడ్డి, పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పాల్గొని ప్రారంభించనున్నారు.
కార్యక్రమంలో దేవాదయ ధర్మాదాయ ఉప కమిషనర్ కేజీ శ్రీనివాస్, సహాయ కమిషనర్ సూర్య ప్రకాష్, ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొననున్నారు.ఈ సందర్భంలో భక్తులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున హాజరుకావాలని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వలివేటి రామానుజన్, ధర్మకర్త మోటు మర్రి రామ సుబ్బారావు పిలుపునిచ్చారు.







