విజయవాడ, 17 – 09 – 2025. కాలేశ్వర రావు మార్కెట్ వద్ద గల ఏపీ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 6 వ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన అజెండా లపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పలు మ్యానేజింగ్ కమిటీలు, పలు ముతవల్లీలను నియమించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా పలుకు స్థలాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు బోర్డు అంగీకరించిందని త్వరలో వాటి వివరాలను వెల్లడిస్తామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 28 ప్రదేశాల్లో తాలిం ఏ హునర్ పేరు తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. పలు చోట్ల జరిగిన అక్రమ ఆక్రమణల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. వక్ఫ్ ఆస్తులను కాపాడుతూ వాటి ద్వారా సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులను చేపడతామని తెలిపారు. వక్ఫ్ బోర్డ్ కార్యకలాపాలను మరింత పారదర్శకంగా కొనసాగిస్తామని తెలిపారు. సమావేశంలో బోర్డ్ సభ్యులైన శాసనమండలి సభ్యులు మొహమ్మద్ రుహుల్లా, శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్, ఖాజా, అక్రమ్, ఇస్మాయిల్ బేగ్, ఆఫియా, ముక్రం హుస్సేన్, దావూద్ భాషా బఖావి, బేపారి జాకీర్ అహమద్ సీఈఓ మొహమ్మద్ అలీ వక్ఫ్ అధికారులు పాల్గొన్నారు.
205 1 minute read