chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News :అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, జనవరి 25:- గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదని, నిర్ణీత గడువుల్లో అన్ని పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అధికారులను ఆదేశించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో టౌన్ ప్లానింగ్, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Guntur Local News :అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి

ఈ సందర్భంగా ప్రజా గ్రీవెన్స్‌లో వస్తున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే, వాటిని ఆలస్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న, ప్రతిపాదిత అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.

25వ వార్డులో గెలాక్సీ బార్ పక్కన ఉన్న రోడ్డును వెడల్పు చేయడంలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించి, జనవరి 30లోపు పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. అలాగే 25వ డివిజన్‌లోని జమీందార్ చెరువుకు కాంపౌండ్ వాల్ నిర్మించి, ప్రజలకు ఉపయోగపడేలా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

43వ డివిజన్ విద్యానగర్ రెండో లైన్‌లో పునర్నిర్మాణ ప్రక్రియను పూర్తిచేసి వెంటనే బాండ్లు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సుగాలి కాలనీ కాలువ నిర్మాణానికి శాంక్షన్ మంజూరైన నేపథ్యంలో, 20 మీటర్ల పొడవున కాలువ పనులకు అడ్డుగా ఉన్న సమస్యలను తొలగించి వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు.

ముత్యాల రెడ్డి నగర్ మెయిన్ రోడ్డుకు సంబంధించి సీసీ రోడ్డు, కాలువల పనులు మంజూరైనందున, మాస్టర్ ప్లాన్ ప్రకారం 40 అడుగుల వెడల్పుతో అభివృద్ధి చేయాలని, పనులు వేగవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యానగర్ మొదటి లైన్ విస్తరణ పనులు సీతయ్య డొంక వరకు పూర్తి చేయాలని తెలిపారు.

నీలంపాటి అమ్మవారి గుడి నుంచి ఆంజనేయ స్వామి గుడి వరకు కాలువల నిర్మాణానికి మంజూరు ఉన్నందున, రోడ్డు విస్తరణ కూడా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ముత్యాల రెడ్డి నగర్ వాగు నుంచి అమరావతి రోడ్డు వరకు కాలువ నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ ద్వారా మార్కింగ్ చేసి, అవరోధాలను తొలగించి సర్వే పూర్తిచేయాలని ఆదేశించారు.

49వ డివిజన్ కొండయ్య కాలనిలో రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని స్పష్టం చేశారు. 36వ డివిజన్‌లోని రజక చెరువు సర్వే పూర్తైన నేపథ్యంలో అక్కడ కాంపౌండ్ వాల్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.

Guntur Local News :అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి

20వ డివిజన్ నంబూరు సుభాని కాలనీ, పీకల వాగు కట్ట వద్ద 20 మీటర్ల రోడ్డు పనులు నిలిచిపోయాయని పేర్కొంటూ, సర్వే నిర్వహించి రోడ్డు ఏర్పాటు చేస్తే ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తీరుతాయని అన్నారు. వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.Guntur Local News

అలాగే అనంతవరపాడు లేఔట్ పరిధిలో సుమారు 6 వేల మంది లబ్ధిదారులకు గత వైసీపీ ప్రభుత్వంలో స్థలాలు చూపించకుండా రిజిస్ట్రేషన్లు చేసిన కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే లబ్ధిదారులకు కేటాయించిన స్థలాలు చూపించి, ఇళ్ల నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని అధికారులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker