
హైదరాబాద్, అబిడ్స్:- అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. ఛాపెల్ రోడ్‌లోని మల్లారెడ్డి ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్స్ విధులు ముగించుకుని హాస్టల్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం… శిరీష అనే మహిళ మెడలో ఉన్న సుమారు 2.5 తులాల బంగారు గొలుసును ఓ దుండగుడు లాక్కొని పరారయ్యాడు. బైక్‌పై ఒక్కడే వచ్చిన ఆగంతకుడు వేగంగా వచ్చి చైన్‌ను స్నాచ్ చేసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

ఘటనతో బాధితురాలు తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థల పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.Hyderabad Local News
ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ పెంచాలని వారు కోరుతున్నారు.







