
అమరావతి, ఫిబ్రవరి 14:- Amaravati లో రాజకీయ, పరిపాలనా పరిణామాలు వేగం పుంజుకున్నాయి. అభివృద్ధి–సంక్షేమం సమంగా ప్రతిబింబించేలా 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చట్టసభలకు సమర్పించనుంది.

ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో 2026–27 ఆర్థిక బడ్జెట్‌కు మంత్రివర్గ ఆమోదం లభించే అవకాశం ఉంది. అనంతరం ఉదయం 11:15 గంటలకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి Payyavula Keshav అసెంబ్లీలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో శాసన మండలిలో మంత్రి Vangalapudi Anitha బడ్జెట్‌ను సమర్పించనున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రత్యేకంగా మంత్రి Anagani Satya Prasad ప్రవేశపెట్టనున్నారు.

అభివృద్ధి–సంక్షేమం సమతూకంగా కొనసాగించే దిశగా ఆర్థికశాఖ బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో కూటమి ప్రభుత్వ దృక్పథం ప్రతిబింబించేలా ఈసారి బడ్జెట్‌కు ప్రత్యేక రూపురేఖలు రూపొందించారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
బడ్జెట్‌కు ముందు పది రోజులపాటు ప్రీ-బడ్జెట్ సమావేశాలు నిర్వహించగా, వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారుల సూచనలు సేకరించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర బడ్జెట్ రూపొందించబడినట్లు తెలుస్తోంది. అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్ట్, సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు, మూడు ఆర్థిక జోన్లు, రాయలసీమ ఉద్యాన హబ్ వంటి అంశాలకు ప్రాధాన్యత దక్కనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, పయ్యావుల కేశవ్ శాసనసభలో మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషం. ఇంతకు ముందు ఒకసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్, మరొకసారి పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించారు. ఈసారి ఎన్నికల మేనిఫెస్టో అమలు దిశగా స్పష్టమైన ఫలితాలు చూపించేలా బడ్జెట్ ఉండవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వ్యవసాయ బడ్జెట్ అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. రేపు, ఎల్లుండి చట్టసభలకు సెలవు ఉండగా, ఈ నెల 17న బడ్జెట్‌పై ఉభయ సభల్లో చర్చ జరగనుంది.Amaravathi Local News
మొత్తంగా “ప్రగతి – సంక్షేమం” అనే ద్విప్రధాన లక్ష్యాలతో రూపుదిద్దుకున్న ఈ బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశకంగా ఉండబోతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.








