
అమరావతి, ఫిబ్రవరి – ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , అలాగే వారి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ మందపాటి ఆంధ్రేయ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
24 గంటల్లోగా అంబటి రాంబాబు బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంబటి రాంబాబు అనుచితంగా వ్యవహరించారని, అదే ధోరణిని ఇప్పటికీ కొనసాగించడం తగదని మందపాటి వ్యాఖ్యానించారు.Amaravathi news:రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీలు, నియామకాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠను దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలను ప్రజలు సహించబోరని, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. సీఎం స్థాయికి తగ్గ గౌరవం పాటించాల్సిందేనని, లేకపోతే ప్రజా ఆగ్రహం తప్పదని మందపాటి ఆంధ్రేయ స్పష్టం చేశారు.










