
బాపట్ల: ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బాపట్ల జిల్లా ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (CITU) ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ఎలిజిబెత్ రేఖ, CITU జిల్లా కార్యదర్శి సి.హెచ్. మజుందార్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

ప్రధాన డిమాండ్లు మరియు విమర్శలు:
- నెరవేరని హామీలు: గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు, ప్రస్తుత కూటమి నాయకులు మద్దతు తెలిపి.. తాము అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఆ ఊసే లేదని విమర్శించారు.
- కనీస వేతనం: అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని, వేసవి సెలవులకు సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
- ప్రభుత్వ నిర్లక్ష్యం: అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.
- సంస్కరణలు: ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరూ విధిగా అంగన్వాడీ కేంద్రాల్లోనే చదివేలా జీవో విడుదల చేయాలని, హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యం తొలగించాలని డిమాండ్ డిమాండ్ చేశారు.Bapatla Local News
కేంద్ర ప్రభుత్వంపై ధ్వజం:
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల బతుకులను వీధుల పాలు చేశాయని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు.
పాల్గొన్న వారు: ఈ కార్యక్రమంలో CITU బాపట్ల కన్వీనర్ శరత్, అంగన్వాడీ ప్రాజెక్టు నాయకులు శైలశ్రీ, హేమమాలిని, సీతామహాలక్ష్మి, హైమా, శ్రీలత, బేబీ రాణి, భారతి, లక్ష్మి తదితర కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







