
అహ్మదాబాద్ : విమాన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 274కు చేరింది. ఫ్లైట్లోని 241 మందితోపాటు బీజే మెడికల్ కాలేజీకి చెందిన 33 మంది చనిపోయారు. పలువురు క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. కాగా ప్రమాదం జరగగానే 24 మంది మెడికోలు మృతి చెందగా, చికిత్స పొందుతూ మరో 9 మంది మరణించారు.







