
ఇమేజ్-గైడెడ్ మస్కులోస్కెలెటల్ ఇంటర్వెన్షన్స్‌పై రెండో ప్రపంచ సదస్సు**
మంగళగిరి(గుంటూరు) :ఏఐఐఎంఎస్ మంగళగిరిలో ఇమేజ్-గైడెడ్ క్యాడావెరిక్ హ్యాండ్స్-ఆన్ మస్కులోస్కెలెటల్ ఇంటర్వెన్షన్స్‌పై రెండో అంతర్జాతీయ సదస్సు శనివారం ఘనంగా ప్రారంభమైంది. రేడియాలజీ, అనాటమీ విభాగాలు సంయుక్తంగా, మస్కులోస్కెలెటల్ సొసైటీ ఆఫ్ ఇండియా (MSS) మరియు ఏపిరియా (Asian Pacific International Radiology & Intervention Association)తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

సదస్సును ఏఐఐఎంఎస్ కార్యనిర్వాహక డైరెక్టర్ ప్రొ. (డా.) అహంతోం సాంటా సింగ్ అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీన్ (అకాడెమిక్స్) ప్రొ. (డా.) దేశు రామమోహన్, డీన్ (రీసెర్చ్) & అనాటమీ విభాగాధిపతి డా. జోయ్ ఏ. ఘోషాల్, ఏషియన్ మస్కులోస్కెలెటల్ సొసైటీ అధ్యక్షుడు డా. నాగ వర ప్రసాద్ వేమురి, మస్కులోస్కెలెటల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా. ఎం.వి. చలపతి రావు, ఏపీఎంసీ పరిశీలకులు డా. శేషు లక్ష్మి, రేడియాలజీ విభాగాధిపతి డా. ఏ. ప్రుధ్వీనాథ్ రెడ్డి, అనాటమీ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ డా. అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ రెండు రోజుల సదస్సులో భారతదేశం సహా 7 దేశాల నుండి ప్రతినిధులు, 5 దేశాల నుండి నిపుణ అధ్యాపకులు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సదస్సులో భాగంగా ఇమేజ్ గైడెడ్ ప్రత్యక్ష ప్రదర్శనలు, క్యాడావెరిక్ హ్యాండ్స్-ఆన్ శిక్షణ, భుజం నుంచి పాదం వరకు వివిధ మస్కులోస్కెలెటల్ ఇంటర్వెన్షన్ టెక్నీక్స్‌పై ప్రత్యేక మాడ్యూల్స్ నిర్వహించబడుతున్నాయి.

జాతీయ, అంతర్జాతీయ నిపుణులు శస్త్రచికిత్సా నైపుణ్యం, అనాటమికల్ ఖచ్చితత్వం, ఆధునిక క్లినికల్ పద్ధతులపై దృష్టి సారిస్తూ శిక్షణా సెషన్లు అందిస్తున్నారు.
100 కంటే ఎక్కువ మంది డెలిగేట్లు పాల్గొనడం, ఈ రంగంలో ఆధునిక హ్యాండ్స్-ఆన్ శిక్షణకు పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబిస్తోంది.
వైద్య విద్య, క్లినికల్ సేవలు, పరిశోధన రంగాల్లో విశిష్టతను సాధించడంలో భాగంగా ఇలాంటి అంతర్జాతీయ శిక్షణా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఏఐఐఎంఎస్ మంగళగిరి ప్రతినిధులు తెలిపారు








