
బాపట్ల జిల్లా, బట్టీపోలు మండలం అక్కివారిపాలెం గ్రామంలోని క్రీస్తు లూథరన్ దేవాలయం (చర్చ్)లో జెండా పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామ యువత చురుగ్గా పాల్గొని పండుగను విజయవంతంగా జరిపింది. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, భక్తిగీతాలు నిర్వహించగా, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో డీజే పాటలతో ఉత్సవ వాతావరణం నెలకొంది.
జెండా పండుగ నిర్వహణకు గ్రామానికి చెందిన 10 మంది బాధ్యతలు చేపట్టగా, సుమారు 500 మంది భక్తులు, గ్రామస్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ జెండా పండుగ గత 100 సంవత్సరాలుగా నిరంతరంగా జరుగుతుందని గ్రామ పెద్దలు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా పండుగను ఘనంగా నిర్వహిస్తామని గ్రామస్తులు వెల్లడించారు. గ్రామంలో ఐక్యత, భక్తి భావాన్ని పెంపొందించేలా ఈ వేడుకలు జరిగాయని వారు పేర్కొన్నారు







