

బాపట్ల జిల్లా అమరావతి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షరాస్యతలో 36వ స్థానంలో ఉండటం ఆందోళనకరమని, ఈ పరిస్థితిని మార్చి రాష్ట్రాన్ని అగ్రపథాన నిలపడమే అక్షరాంధ్ర” కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి కోన శశిధర్, కమిషనర్ పి. రంజిత్ బాషా తెలిపారు. సోమవారం అమరావతి నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బాపట్ల జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డా. వి వినోద్ కుమార్ పాల్గొన్నారు..







