- .కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏపీ రేషియో తక్కువ.
సివిల్స్, గ్రూప్స్, స్టాఫ్ సెలక్షన్,బ్యాంకింగ్ వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ యువత కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు . గుంటూరు లక్ష్మి పురంలో లో ఎమ్మెల్సీ కార్యాలయం లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు , మాజీ ఎమ్మెల్సీ లు అశోక్ బాబు ,ఏ ఎస్ రామకృష్ణ , బుచ్చిరామశాస్త్రి తో కలిసి వివరాలు వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వం ద్వారా రెండున్నర లక్షల ఉద్యోగాలు వస్తున్నప్పటికీ అందులో ఆంధ్రాలో యువతకు వస్తున్న ఉద్యోగుల శాతం తక్కువగాఉన్నాయన్నారు.
సాఫ్ట్వేర్ మోజులో, కేంద్ర ఉద్యోగాలపై ఆంధ్ర యువత ఆసక్తి చూపటం లేదన్నారు. ఈ నేపథ్యంలో నైపుణ్యం కలిగిన యువతకు గుంటూరు కేంద్ర గా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు.ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు .
దసరా పండుగ నుండి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈనెల7, 21 వ తేదీన ఎన్జీవో కళ్యాణ మంటపంలోఅవగాహన సదస్సు నిర్వహించి,అర్హత పరీక్షలో ఎంపిక అయిన వారికి ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. ఈ శిక్షణలో పాల్గొనేరెండు బ్యాచ్ లకు
అవసరమైన కంప్యూటర్లు, బుక్స్ అందజేస్తామన్నారు.