
గుడివాడ:– పట్టణంలోని జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ కార్యాలయంలో ఏపీ ఫోరం మిషనరీ అండ్ ఇంప్లిమెంట్స్ మ్యానుఫ్యాక్చర్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లం రామ్మోహన్ ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను మాజీ మంత్రి కొడాలి నాని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ, దేశంలోని పలు ప్రాంతాలకు వ్యవసాయ పరికరాలను సరఫరా చేస్తున్న పరిశ్రమలు ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. పరిశ్రమ కుంటుబడటంతో యాజమాన్యం, కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నూతన సంవత్సరంలో పరిశ్రమలు అభివృద్ధి చెంది, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.Gudivada news
ఈ కార్యక్రమంలో గొర్ల శ్రీను, జాన్ విక్టర్, కొంకితల ఆంజనేయ ప్రసాద్, మైనార్టీ నాయకులు బాజీ, మాదాసు వెంకటలక్ష్మి, అల్లం సూర్యప్రభ, జ్యోతుల సత్యవేణి తదితరులు పాల్గొన్నారు.










