
మాగల్లు, నవంబర్ 1:అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు.జగ్గయ్యపేట నియోజకవర్గంలోని నందిగామ మండలం మాగల్లు గ్రామంలో జిల్లా పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షులు కొమ్మినేని రవిశంకర్ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నందిగామ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఇన్ ఛార్జ్ మొండితోక జగన్ మోహన్ రావు, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, దేవినేని అవినాష్‌తో కలిసి అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.







