
చీరాల:15-12-25:-ఆంధ్ర రాష్ట్ర సాధనలో అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా చీరాల ఆర్‌ఆర్ రోడ్‌లోని కామధేను కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కొండయ్య గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Chirala lo TDPఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఏకైక లక్ష్యంతో పొట్టి శ్రీరాములు సుదీర్ఘ దీక్ష చేపట్టి తన ప్రాణాలను సైతం లెక్కచేయని మహానీయుడని కొనియాడారు. ఆయన త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని, అదే దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిందని తెలిపారు. తెలుగు భాష, సంస్కృతి, ఆత్మగౌరవాన్ని కాపాడటంలో పొట్టి శ్రీరాములు చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోరాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్ధన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, చీరాల మండల టీడీపీ అధ్యక్షులు గంజి పురుషోత్తం, పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు దర్శి నాగేంద్రమణి, పిక్కి నారాయణ, కౌన్సిలర్లు, కూటమి నాయకులు, అధికారులు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అమరజీవికి నివాళులు అర్పించారు.







