
ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం తన ప్రాణాలను అర్పించి, భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడిగా చరిత్రలో నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రేపల్లెలోని అంకమ్మ చెట్టు వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి సోదరులు శ్రీ అనగాని శివప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్ హాజీ షైక్ హస్సన్ బాషా గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు ప్రముఖ నేతలు ఆలపాటి వేణుగోపాల్ రావు, కాళేపల్లి విశ్వర్ బాబు, మల్లిఖార్జున రావు, ఆకుల సత్యనారాయణ, వేముల రామకోటేశ్వరరావు, కాలేపల్లి మహేష్, గౌరీ రాంకుమారి, కోట సత్యవతి మరియు ఇతర ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ మహనీయుడి త్యాగాలను స్మరించుకున్నారు.Repalle local News :రేపల్లెలో ఘనంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ జన్మదిన వేడుకలు







