
అమరావతి:13-10-25: ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా మరో భారీ అడుగు పడింది. రాష్ట్రానికి చారిత్రాత్మక ఘట్టంగా నిలిచే గూగుల్ ‘ఏఐ హబ్’ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య రేపు (మంగళవారం) ఢిల్లీలో అవగాహన ఒప్పందం (MoU) కుదరనుంది. ఈ ఒప్పందం ద్వారా విశాఖపట్నం గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా మారబోతోందిఈ సందర్భంగా మంగళవారం ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీ మాన్‌సింగ్ హోటల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, గూగుల్ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. $10 బిలియన్ పెట్టుబడి – దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌డీఐఈ ప్రాజెక్టు ద్వారా విశాఖలో గూగుల్ సంస్థ సుమారు $10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. అంటే దాదాపు రూ.87,250 కోట్లు. ఇది దేశంలోనే కాదు, ఆసియా స్థాయిలో కూడా గూగుల్ పెట్టే అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుంది. 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయనున్నారు.
లోకేష్ కృషి ఫలితమేఈ ప్రాజెక్టుకు తాళం దిద్దినది రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కృషి. గతేడాది అక్టోబర్ 31న అమెరికా పర్యటనలో భాగంగా సాన్‌ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తో లోకేష్ సమావేశమై ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చారు. అనంతరం జరిగిన వరుస చర్చలతో ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. 1.88 లక్షల ఉద్యోగాలు – రూ.47,720 కోట్ల ఆర్థిక లక్ష్యంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే అయిదేళ్లలో రాష్ట్రానికి రూ.47,720 కోట్ల ఆర్థిక లాభం చేకూరనుంది. అలాగే 1.88 లక్షల నేరుగా మరియు పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. వార్షికంగా రూ.10,518 కోట్ల స్థూల రాష్ట్ర ఉత్పత్తి (GSDP) వృద్ధి మరియు రూ.9,553 కోట్ల అదనపు ఆదాయం కలుగుతుందని అంచనా. విశాఖ – ఏఐ ట్రాన్స్‌ఫర్మేషన్ కేంద్రంగాఈ హబ్ ద్వారా గూగుల్ తన పూర్తి ఎఐ వ్యవస్థను భారత్‌లో అమలు చేయనుంది. క్లౌడ్ సర్వీసులు, డేటా నెట్‌వర్క్స్, క్లిన్ ఎనర్జీ ఆధారిత డేటా సెంటర్లు, సముద్రపు కేబుల్ కనెక్టివిటీతో విశాఖపట్నాన్ని భారతదేశానికి ఎఐ గేట్వేగా అభివృద్ధి చేయనున్నారు. ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధంAmaravathi news:సీఆర్డీఏ భవనాన్ని రైతులతో కలసి ప్రారంభించిన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబుఈ ప్రాజెక్టు రాష్ట్ర ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) నుంచి ఇప్పటికే ఆమోదం పొందింది. వేగంగా అమలు అయ్యేలా సింగిల్ విండో క్లియరెన్స్, ప్లగ్-అండ్-ప్లే మౌలిక వసతులు, రెన్యూవబుల్ ఎనర్జీ యాక్సెస్, ప్రత్యేక జోన్‌ల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టనున్నారు.







