chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
అమరావతి

Amaravathi News: Minister Kandula Durgesh is happy about the GSI recognition of Belum Caves

  • పురాతన సంస్కృతీ, వారసత్వానికి బెలుం గుహలు ప్రతీకని వెల్లడి
  • అంతర్జాతీయ స్థాయిలో బెలూం గుహలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామని హామ

అమరావతి: పురాతన సంస్కృతీ, వారసత్వానికి ప్రతీక అయిన బెలుం గుహలకు భౌగోళిక వారసత్వ జాబితాలో చోటు దక్కడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ప్రకటనతో నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో క్రీ.పూ 450 ఏళ్ల నాటి చరిత్ర గలిగి సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బెలూం గుహలకు పర్యాటకంగా మరింత ప్రాచుర్యం లభిస్తుందని భావిస్తున్నామన్నారు.

భౌగోళిక వారసత్వ ప్రదేశంగా వచ్చిన గుర్తింపుతో మరింత అభివృద్ధికి నోచుకునేందుకు అవకాశముందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలో రెండోది, దేశంలోనే పొడవైన అంతర్భాగ గుహలుగా బెలూం గుహలు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందాయన్నారు. బెలూం గుహల్లో భూగర్భంలో దాగి ఉన్న ఊహాతీతమైన ప్రకృతి సౌంద్యాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవడమే గాక ఆహ్లాదాన్ని సైతం అందిస్తున్నాయన్నారు. లక్షలాది మంది పర్యాటకులు వీటిని చూసేందుకు వస్తుంటారని మంత్రి వివరించారు. దేశవిదేశీ పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా ప్రచారం చేస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమలో తిరుమల, అహోబిలం, మహానంది, యాగంటి, శ్రీశైలం, బ్రహ్మంగారిమఠం, గండికోట, సిద్ధవటం, గండి, హార్సిలీహిల్స్ తదితర పదుల సంఖ్యలో అధ్యాత్మిక క్షేత్రాలతో పాటు అందమైన పర్యాటక ప్రదేశాలు కోకొల్లలు ఉన్నాయని వాటన్నింటిని అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు.

Authors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker