

ఉపాధిహామీ పథకానికి పనుల గుర్తింపు ప్రక్రియ పటిష్టంగా చేపట్టాలి…. ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతు వారి పాలెం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పై జరిగిన ప్రత్యేకమైన గ్రామ సభలో పాల్గొని, ఉపాధి హామీ పథకం కింద రాబోవు ఆర్ధిక సంవత్సరం 2026-2027 లకు పనుల గుర్తింపు ప్రక్రియ పటిష్టంగా చేపట్టాలి అని ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలియ జేశారు.
గ్రామ సభలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలు మరియు విధివిధానాల గురించి ఎ పి ఓ శ్యాం వివరించి, గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ మరియు రైతుల సహకారంతో గుర్తించిన పనుల జాబితాను వివరించటంపై గ్రామస్తులతో పాటు ఎంపీటీసీ తాండ్ర సంతృప్తిని వ్యక్త పరిచారు.
ఎంపీటీసీ తాండ్ర మరియు ఎంపిడిఓ శ్రీనివాసరావు లు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పని పథకం యొక్క జాబ్ కార్డు లను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాభివృద్ధికి సహకరించాలి అని కోరారు.
కొసమెరుపు… గ్రామ సభ నిర్వహణ పై ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు కొంత అసహనాన్ని మరియు అసంతృప్తిని వ్యక్త పరిచారు. గ్రామ సభలు జరిగేటప్పుడు సరైన వసతులు కల్పించకుండా నామమాత్రంగా గ్రామ సభలు జరుపుతూ, అరకొర వసతులు కల్పించటం బాధాకరం అన్నారు. గ్రామ సభలకు వచ్చే రైతులు కూర్చోవడానికి కుర్చీలు చాలాకపోవడం, మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయకపోవటం, సభా సమయంలో ఆకస్మిక ఇబ్బందుల పరిష్కారం కోసం మెడికల్ కిట్స్ ప్రదర్శించకపోవటం మొదలగు కనీస సౌకర్యాలను కూడా విస్మరించి సభలు ఏర్పాటు మంచి పరిణామం కాదు అని తెలియ జేసి, అన్ని గ్రామాలలో భవిష్యత్తులో ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ స్థాయి అధికారులకు మరియు మండల అభివృద్ధి అధికారికి సూచించారు.
కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీనివాసరావు, ఎ పి ఓ శ్యాం, సెక్రెటరీ షాహిన్ సుల్తాన్ బేగం, టీడీపీ యూనిట్ ఇంచార్జి మాడా శ్రీనివాసరావు, టీడీపీ గ్రామ పార్టీ ఇంచార్జ్ మునిపల్లి చిన్నా, జనసేన ఇంచార్జి గరిగంటి శ్రీనివాసరావు, సాయిని రాంబాబు, ఫీల్డ్ అసిస్టెంట్ షాలిని








