
గుంటూరు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం నందు నగర పాలక సంస్థ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. మొదటి రోజు ఉదయం మహిళామణులంతా రంగవల్లులతో అబ్బురపరిచే ముగ్గులను తీర్చిదిద్దారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి,నగర కమీషనర్ శ్రీ పులి శ్రీనివాసులు, జనసేన పార్టీ నాయకులు, 18వ డివిజన్ కార్పోరేటర్, నిమ్మల వెంకట రమణ ముగ్గులను పరిశీలించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి మరియు పాల్గొన్న మహిళలందరికీ బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, న్యాయనిర్ణేతలు, డప్యూటీ కమీషనర్లు,జీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.







