విజయవాడ:23 09 25 దుర్గ అమ్మవారి కరుణతో దేశం సుభిక్షంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆకాంక్షించారు. మంగళవారం కానకదుర్గమ్మ ఆలయానికి విచేసిన ఆయన, అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లను సమీక్షించిన మాధవ్, యాత్రికులకెట్టి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టిన దేవాదాయ శాఖ అధికారులను మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలి. దేశం సుభిక్షంగా, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించాను,” అని పేర్కొన్నారు.