

ప్రపంచ యాంటీ మైక్రోబియల్ అవేర్‌నెస్ వీక్
18 నుండి 24 నవంబర్ 2025 వరకు
థీమ్ : “ఈరోజే చర్యలు తీసుకోండి – మన వర్తమానాన్ని రక్షించండి, భవిష్యత్తును సురక్షితం చేసుకోండి”
ప్రపంచ యాంటీ మైక్రోబియల్ అవేర్‌నెస్ వీక్ సందర్భంగా, బాపట్లలోని ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ గారు, DM&HO మేడం గారు, మరియు ప్రోగ్రామ్ అధికారులు కలిసి ప్రారంభించారు.
అవసరంలేని యాంటీబయోటిక్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, ఔషధ నిరోధకత పెరుగుతున్న ప్రమాదం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ వారపు లక్ష్యం.
ఈ సందర్భంగా జిల్లాలోని వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, మరియు ఇతర హెల్త్ ప్రోగ్రామ్ బృందాలు ప్రజలకు అవగాహన కార్యక్రమాలను చేయవలెను అవగాహన కార్యక్రమంలో ఫొటోస్ అన్నిటినీ గ్రూపు నందు షేర్ చేయవలెను.







