గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమంను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. తొలుత ప్రజాదర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వాటిని పరిష్కరిచవలసినదిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ…. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అతి పెద్ద పండుగ మహానాడు అని, దీనిలో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మినీ మహానాడును ఘనంగా నిర్వహించనున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. దీనికి నియోజకవర్గము నుండి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. అదే విధంగా పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్నామని, కష్టపడిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హామీనిచ్చారు. అదే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి, ప్రతిపక్ష నాయకులు చేసే విషప్రచారాన్ని ప్రజలతోనే తిప్పికొట్టాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచించారు.
258 Less than a minute