
విజయవాడ సిటీ, అక్టోబర్ 23:-ప్రజా సంక్షేమ అంశాలపై ఆంధ్రా పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగిన జాయింట్ కాన్ఫరెన్స్ విజయవంతంగా ముగిసింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.సమావేశానికి చైర్మన్‌గా ఆంధ్రా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ జలాది చంద్రనంద్ వ్యవహరించగా, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ వి.జి.ఆర్. నారగోని, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధం రెడ్డి శివశంకర్ రెడ్డి, ఫ్రంట్ ఫౌండర్ శ్రీధర్, జై ఆంధ్ర ప్రతినిధి జైబాబు, బి. కాపు నాడు ప్రెసిడెంట్ గిడ్డ శ్రీనివాస్ నాయుడు, బేడ బుడగ జంగం నాయకుడు వనమా నాగేశ్వరరావు, కాపు సంఘం నాయకుడు వేల్పురి శ్రీనివాస్, ప్రజా కార్యకర్తలు అంజినిరెడ్డి, దుర్గా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.సభలో రైతుల అభివృద్ధి, యువత ఉపాధి, మహిళా సాధికారత, విద్యార్థుల భవిష్యత్తు, పబ్లిక్ సెక్టార్ పరిరక్షణ, గ్రామీణ అభివృద్ధి వంటి ప్రజా సమస్యలపై విస్తృత చర్చ జరిగింది.
నాయకులు మాట్లాడుతూ,బీసీ రిజర్వేషన్లను 42% వరకు పెంచే రాజ్యాంగ సవరణను కేంద్రం తక్షణం చేపట్టాలని,రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని,రైతులకు లాభదాయక ధరలు, రుణమాఫీ ఇవ్వాలని,యువత ఉపాధి కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని,ఉచిత ఆరోగ్య సేవలు, విద్యా వ్యవస్థ బలోపేతం చేయాలని,మహిళలకు 50% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఫ్రంట్ చైర్మన్ జలాది చంద్రనంద్ మాట్లాడుతూ, “ప్రజా సేవ ప్రతి నాయకుడి ప్రాథమిక బాధ్యత. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడమే అసలైన నాయకత్వం” అని పేర్కొన్నారు.అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ప్రజా అవగాహన కార్యక్రమాలు, ఉద్యమాలు చేపట్టాలని, రాబోయే ఎన్నికల్లో కలెక్టివ్ క్యాబినెట్ విధానాన్ని అవలంబించాలని తీర్మానించారు.

ప్రతి పార్టీకి ఒక్క మంత్రిత్వ శాఖ కేటాయించి ప్రజాస్వామ్యంలో జనాభా ప్రాతిపదికన సమాన ప్రాతినిధ్యం కల్పించే దిశగా ఆంధ్రా పొలిటికల్ ఫ్రంట్ ప్రత్యేక ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.సమావేశం చివర్లో ఫ్రంట్ చైర్మన్ జలాది చంద్రనంద్ ఫైనల్ తీర్మానాన్ని ప్రకటించారు.







