
గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో మంగళగిరి లోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకుంటారా.. ఏనాడైనా పాపం పండుతుంది. గ్రీవెన్స్ లో వచ్చే సమస్యల్లో అధిక శాతం భూకబ్జాలే. సభ్య సమాజం తలదించుకునేలా వల్లభనేని వంశీ మాట్లాడారు. జగన్ కు అలాంటివారే నచ్చుతారు. వంశీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు వారించలేదు? ఇకనైనా జగన్ తన వైఖరి మార్చుకోవాలి. వైసీపీ నేతలు గన్నవరంలో భూములు కబ్జా చేశారు. ఎవరైనా చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలి” అని వెంకట్రావు అన్నారు.







