
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి, జీవనశైలి మార్చుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు, ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు అందిస్తామని చెప్పారు. తక్కువ ఖర్చుతో పేదలకు నాణ్యమైన వైద్యం కోసం రూ.1618 కోట్లతో ఎయిమ్స్ నిర్మాణం జరుగుతుందని ఆయన అన్నారు. అదేవిధంగా వైద్య రంగంలో కిమ్స్‌ది ప్రత్యేక స్థానం ఉందని, అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈమేరకు గుంటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన కిమ్స్ శిఖర ఆస్పత్రిని సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రులు సత్య కుమార్, అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, నారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, కిమ్స్ ఆసుపత్రి నిర్వాహకులు పాల్గొన్నారు.







