chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
అమరావతిఆంధ్రప్రదేశ్

Amaravathi Local News :అమరావతి 2027 నాటికి పోలవరం పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం-మంత్రి కందుల దుర్గేష్

అమరావతి:05-02-26:-అమరావతిలో నిర్వహించిన సాగునీటి వినియోగదారుల సంఘాల రాష్ట్ర స్థాయి సమావేశంలో గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

పడకేసిన నీటిపారుదల రంగానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన జవజీవాలు అందించారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రైతాంగ శ్రేయస్సే లక్ష్యంగా నదుల అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందని అన్నారు.

గురువారం అమరావతి పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు తదితర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖపై సరైన అవగాహన లేని మంత్రులు వ్యవహరించారని విమర్శించారు. ప్రస్తుతం మంత్రి నిమ్మల రామానాయుడు నేతృత్వంలో నీటిపారుదల శాఖ 24 గంటలు పని చేస్తూ వేగంగా ముందుకు సాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. గతంలో ‘సోమవారం–పోలవరం’ కార్యక్రమం ద్వారా ప్రాజెక్టును పరుగులు పెట్టించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇప్పుడు పోలవరాన్ని 2027 నాటికి పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారని తెలిపారు.

కూటమి ప్రభుత్వం నీటిపారుదల వ్యవస్థను గాడిలో పెట్టి, ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పూర్తి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. గోదావరి–కృష్ణా–పెన్నా నదుల అనుసంధానంతో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు సుసంపన్నం అవుతున్నాయని తెలిపారు. నదుల అనుసంధానం వల్లనే అనంతపురం జిల్లా, కోనసీమను మించిన అభివృద్ధిని సాధిస్తోందని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా నీటి సరఫరా రంగంలో విశేష ప్రగతి సాధిస్తున్నారని కొనియాడారు. అనివార్య కారణాల వల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారని, ఆయన ప్రతినిధిగా తాను పాల్గొన్నట్లు మంత్రి తెలిపారు.

తుంగభద్ర డ్యామ్ 19వ గేట్ కొట్టుకుపోయిన ఘటనలో సీఎం చంద్రబాబునాయుడు తక్షణమే స్పందించి, మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌లను అక్కడికి పంపి కేవలం ఐదు రోజుల్లోనే సమస్యను పరిష్కరించారని మంత్రి ప్రశంసించారు. అలాగే 786 కిలోమీటర్ల పొడవైన హంద్రీనీవా కాలువ మరమ్మతు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు.Amaravathi news

రాష్ట్రంలో ఉన్న 6,047 నీటి వినియోగదారుల సంఘాలు, 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 58 ప్రాజెక్టు కమిటీలు బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్య నిర్వహణ, చెరువుల నింపుదల, భూగర్భ జలాల పెంపు వంటి అంశాల్లో సీఎం చంద్రబాబునాయుడు సూచించిన మార్గదర్శకాలను అనుసరించి ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేయడంలో భాగస్వాములు కావాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ మాధవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

తేది: 05-02-2026
అమరావతి

2027 నాటికి పోలవరం పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్

అమరావతిలో నిర్వహించిన సాగునీటి వినియోగదారుల సంఘాల రాష్ట్ర స్థాయి సమావేశంలో గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

పడకేసిన నీటిపారుదల రంగానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన జవజీవాలు అందించారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రైతాంగ శ్రేయస్సే లక్ష్యంగా నదుల అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందని అన్నారు.

గురువారం అమరావతి పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు తదితర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖపై సరైన అవగాహన లేని మంత్రులు వ్యవహరించారని విమర్శించారు. ప్రస్తుతం మంత్రి నిమ్మల రామానాయుడు నేతృత్వంలో నీటిపారుదల శాఖ 24 గంటలు పని చేస్తూ వేగంగా ముందుకు సాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. గతంలో ‘సోమవారం–పోలవరం’ కార్యక్రమం ద్వారా ప్రాజెక్టును పరుగులు పెట్టించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇప్పుడు పోలవరాన్ని 2027 నాటికి పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారని తెలిపారు.

కూటమి ప్రభుత్వం నీటిపారుదల వ్యవస్థను గాడిలో పెట్టి, ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పూర్తి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. గోదావరి–కృష్ణా–పెన్నా నదుల అనుసంధానంతో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు సుసంపన్నం అవుతున్నాయని తెలిపారు. నదుల అనుసంధానం వల్లనే అనంతపురం జిల్లా, కోనసీమను మించిన అభివృద్ధిని సాధిస్తోందని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా నీటి సరఫరా రంగంలో విశేష ప్రగతి సాధిస్తున్నారని కొనియాడారు. అనివార్య కారణాల వల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారని, ఆయన ప్రతినిధిగా తాను పాల్గొన్నట్లు మంత్రి తెలిపారు.

తుంగభద్ర డ్యామ్ 19వ గేట్ కొట్టుకుపోయిన ఘటనలో సీఎం చంద్రబాబునాయుడు తక్షణమే స్పందించి, మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌లను అక్కడికి పంపి కేవలం ఐదు రోజుల్లోనే సమస్యను పరిష్కరించారని మంత్రి ప్రశంసించారు. అలాగే 786 కిలోమీటర్ల పొడవైన హంద్రీనీవా కాలువ మరమ్మతు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker