గుడివాడ లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారి గోడును వెళ్ళబుచారు. హేతుభద్దీకరణ ద్వారా మిగులు ఉద్యోగుల గురించి స్పషత ఇవ్వాలని, జు. అసిస్టెంట్ పే స్కేల్ ఇప్పించాలని, నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని, ప్రమోషన్ ఛానల్ కల్పించాలని, సీనియారిటీ లిస్ట్ వదలాలని, నష్టపోయిన 9 నెలల ఎర్రియర్స్ ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. తక్కువ జీతాలతోనే ఎక్కువ పని చేయిస్తున్నారని, సర్వేలు అని రోడ్లపై తిప్పుతున్నారని, రాత్రి పగలు లేకుండా పని వత్తిడి ఉందని తెలియజేసారు. కనీసం జీతంతో గజేటెడ్ ఉద్యోగుల నిబంధనలు సరికాదని, ప్రొమోషన్స్ మరియు పెస్కేల్ ఇచ్చిన తర్వాతే ట్రాన్స్ఫర్లు చెయ్యాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ప్రసిడెంట్ రాజు, జనరల్ సెక్రటరీ శంకర రావు, సునీత, గణేష్, మనోజ్, రాజేష్, బాషా, పృథ్వీ, రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నిరసనలో భాగంగా గుడివాడ RDO, మునిసిపల్ కమీషనర్, ఎంపీడీఓ లకు వినతి పత్రాలను అందజేశారు. అధికారులు కూడా సానుకూలంగా స్పందించి, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాము అని హామీ ఇచ్చారు.
229 Less than a minute